Tuesday, March 11, 2014

Pawan kalyan Speech For Jana Sena New Party leaked !!


త్వరలో కొత్త పార్టీ స్థాపించేందుకు ముందుకు వెళ్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ చేసే మొట్ట మొదటి రాజకీయ ప్రసంగం లీక్ అయ్యిందా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఎంత వరకు ప్రభావితం చేయగలడో కానీ ... ఇప్పుడు ఎక్కడ చుసిన పవన్ జపం చేస్తున్నారు. పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. అతని ప్రతి కదలికను హలో ఆంధ్ర.కామ్ గమనిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 14న అధికారికంగా పవన్ ప్రెస్ మీట్ ద్వారా తన స్పందన తెలియ చేయబోతున్నాడని విషయం తెలిసిందే. అంతే కాకుండా ఆ ప్రెస్ మీట్లో పవన్ చేసే ప్రసంగం తాలూకు కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. 
ఈ ప్రెస్ మీట్ ప్రసంగానికి కర్త కర్మ క్రియ అన్ని తానై వ్యవహరిస్తున్నారు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అత్యంత సన్నిహితులతో మాత్రమే ఈ ప్రసంగం తాలుకు చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే గంటకు పైగా మాట్లాడే మేటర్ ను రెడీ చేసారని... దానిని 45 నిమిషాలకు కుదించారని సమాచారం. ఇందులో అనేక రాజకీయ, సామాజిక విషయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల నుండి అంతర్జాతీయ రాజకీయాలు కూడా ఉంటాయనేది టాక్. 
ప్రెస్ మీట్ లో ఉండే ముఖ్యమైన అంశాలు...
గతంలో ఓ పొరపాటు చేశాను.. అలాంటి పొరపాట్లు మళ్లీ మళ్లీ రాకుండా చూస్తాను. రాజకీయ పార్టీ మేంటైన్ చేయడం అంటే ట్20 మ్యాచ్ ఆడినంత ఈజీ కాదు. ఒక రోజులో పలితాలు రావు... అలా ఆశించిన వారు భంగపడటం ఖాయం. అలా అయితే ఇప్పటికే దేశంలో కొన్ని లక్షల పార్టీలు పుట్టుకొచ్చేవి.    
కొన్ని రాజకీయ పార్టీ నేతలు లక్ష కోట్ల పైనే సంపాదించారు. అ బడా నేతలు ప్రజల ముందుకు వచ్చే మాట్లాడే దైర్యముందా? దేశ వ్యాప్తంగా ఉన్న అవీనీతి పరుల చిట్టా ప్రజల ముందు ఉంచడం. ఆ లిస్టు త్వరలోనే ప్రజల ముందు పెడతాను. 
నైతికత ఉన్న పార్టీతోనే పొత్తు పెట్టుకొనే ఆలోచన. తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకొన్న రాజకీయ నాయకుల భరతం పట్టడం. అన్యాయాన్ని ఎదిరించండి.. న్యాయాన్ని గెలిపించండి అనే నినాదంతో తెలుగు ప్రజలకు కొత్త వెలుగునివ్వడం. 
వీటితో పాటు యువత, మహిళల సమస్యలు, విద్య, ఆరోగ్యం, మహిళల పురోభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పవన్ తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తాడని సమాచారం. అంతేకాకుండా తాను అధికారం కోసం కాకుండా.. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని, దానికి గల కారణాలు ఏంటో.. వివరణ ఇవ్వటం. 
ఈ విషయాలతో పాటు తనను అనేక రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి రమ్మని ఆహ్వానించినా.. తిరస్కరించడానికి గల కారణాలను కూడా పవన్ విశ్లేషిస్తాడట..! ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు గత ఎన్నికలలో... పవన్ బ్లాక్ మెయిల్ చెయ్యటం... పవన్ దానిని ఎలా తిప్పి కొట్టారో వివరిస్తారని తెలుస్తోంది. ఆ రాజకీయ నాయకుడు ఎవరు? 
రాజకీయ వ్యవస్థ పై తాను రాసిన పుస్తకంపైనా వివరణ ఉంటుందని టాక్. ఈ వార్తల నేపథ్యంలో పవన్ స్పీచ్ పై ఇటు రాజకీయంగా, అటు సినీ ఇండస్ట్రీలో మరింత ఆసక్తి నెలకొంది. మరింత న్యూస్ కోసం చూస్తూనే ఉండండి.

No comments:

Post a Comment